సంస్కృతం దేవ భాష# SANKRIT DEVA BHASA
మనలను చంపిన ఒకే ఒక ఎత్తుగడ!!!! సంస్కృతం మృతభాష మృతభాష అని ఎందుకు ప్రచారం చేశారు ? అసలు ఒక భాషను మృతభాష అని ప్రచారం చేయవలసిన అవసరం ఎవరికున్నది ? వేరే ఏ ఇతర భాషలను అలా ఎందుకు అనలేదు ? ఆలోచించారా ఎప్పుడైనా ??? . ఈ సంస్కృతిని చంపితే కానీ మన ఆలోచనలు మారవు !మన ఆలోచనలు మారితేగానీ మనము వాళ్ళ స్వాధీనం లోకి రాము ! వారి సిద్ధాంతాలు అప్పుడే మన తలకెక్కుతాయి ! . మృతభాష మృతభాష అని వాడితో వంతపాడి మనం జీవన్మృతులమయ్యాము ! . భారతీయ విజ్ఞానము ఉన్నది సంస్కృతం లోనే ! ప్రపంచమేధావులు ఆనందంతో నాట్యంచేసింది సంస్కృత కావ్యాలు చదివే ! ఒక వాల్మీకి ! ఒకవ్యాసభగవానుడు ,ఒక కాళిదాసు ....ఇలా ఎందరో వేల ఏళ్ళనుండీ సుసంపన్నం చేసినభాష! భారతీయ ఆత్మ సంస్కృతం ! . దేవభాష సంస్కృతాన్ని మృతభాష అని ప్రచారం చేసి మనము బతికున్న శవాలమయ్యాము అంతే ! భాష చావలేదు ! ప్రపంచంలో ఇతరదేశాలలో ముఖ్యంగా జర్మనీలో అత్యంత ఆదరణపొందుతున్నది ! . దేవ అంటే ప్రకాశింపచేసేది !దేనిని ప్రకాశింపచేసేది ? మనలో విజ్ఞానజ్యోతులను వెలిగించి మనజీవితాలను ప్రకాశింపచేసే భాష సంస్కృతం !అంతేగానీ ఎక్కడో మనకంటికి కనపడని లోకాలల...