Posts

Showing posts from May, 2020

లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం LABOUR INSURENCE

*లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి*  ➖  ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ➖  కూలీలతో పాటు అందరు అర్హలే ➖  తెల్ల రేషన్ కార్డు తప్పని సరి ➖  ఏడాదికి రూ 22 మాత్రమే _.     5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి, కేవలం 110/-రూ.. మాత్రమే ➖  అవగాహన పెంచుకుందాం ➖  అందరికీ చేరేలా చేయండి 1) 18 నుండి 55 years ఉన్న  స్త్రీ , పురుషులు అర్హులు 2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు. 3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి 4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి. ప్రయోజనాలు 5) పాలసీదారు సహజ మరణం పొందితే  రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ 6.అలాగే  ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/- 7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,, 8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది. 9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది. 👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల...

రైతు పంటను ఎక్కడైనా అమ్ముకునేలా కొత్త చట్టం

రైతు పంటను ఎక్కడైనా అమ్ముకునేలా కొత్త చట్టం     మూడో విడత ప్యాకేజీలో 1.63 లక్షల కోట్లు కేటాయింపు     వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక శాఖలకు నిధులు     లక్ష కోట్లతో అగ్రి ఇన్​ఫ్రాస్ర్టక్చర్ ఫండ్     రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిత్యావసరాల చట్టం     మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు      తేనెటీగల పెంపకానికి, మూలికల సాగుకు ఫండ్స్ న్యూఢిల్లీ:రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా, తమకు నచ్చిన చోట అమ్ముకునేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై కంట్రోళ్లను తొలగిస్తామని చెప్పారు. ఆత్మ నిర్భర్‌‌ భారత్‌‌ అభియాన్​లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి.. మూడో విడత కేటాయింపులను శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​తో కలిసి నిర్మల వివరించారు. 1.63 లక్షల కోట్లను వ్యవసాయం, పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు కేటాయించారు. మంచి ధర వచ్చిన చోట.. ‘‘రైతులు ప్రస్తుతం తమ పంటను ఏపీఎంసీ (అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట...

శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి. టంగుటూరి ప్రకాశం పంతులు

*శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి*   నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా'అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి,అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యి మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే(1917-18 నాటికే)రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు. గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు.తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్...

జీ.డీ.పీ ( G D P ) అంటే ఏమిటి ?*

⚙️ 💰 🛒 *జీ.డీ.పీ ( G D P ) అంటే ఏమిటి ?* మనం టీవీలలో న్యూస్ పేపర్ లలో GDP జీడీపీ పెరిగింది, తగ్గింది అని తరుచుగా వింటూ ఉంటాం. కాకపోతే ఈ GDP అంటే ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. 🎓 *కాబట్టి* అసలు GDP అంటే ఏమిటి ?  అది ఎలా లెక్కిస్తారు ? ఎందుకు అది అంత ముఖ్యమైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. *GDP అంటే Gross Domestic Product. తెలుగులో స్థూల దేశీయోత్పత్తి* అని అంటారు.  *అంటే,* ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం Finished Products (అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడీపీ అవుతుంది. *ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి.* అది ఒక రోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 విలువ చేసే చాకొలేట్, 50 విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ 80 రూపాయలు అవుతుంది. అదే విధంగా *దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడీపీ అవుతుంది.* 😳 *అయితే అన్ని ప్రోడక్ట్ ఈ GDP లోకి చేరవు.* ఉదాహారానికి జపాన్ కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ ని మన ఇండియాలో అమ్మితే అది మన GDP లో చేరదు. జపాన్ దే...

స్టైరీన్ (styrene) గ్యాస్ (C8H8) అంటే..

*వైజాగ్ లో లీకైన స్టైరీన్ గ్యాస్ : మనిషిపై చూపే ప్రభావం ఏమిటి..?*    * *స్టైరీన్ (styrene) గ్యాస్ (C8H8) అంటే...?* *ఎల్. జి పాలిమర్స్ నుంచి లీక్ అయిన గ్యాస్ సైరీన్ ( C8H8).ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీ లో వాడతారు*. *వైజాగ్ లో లీకైన గ్యాస్ ను స్టైరీన్ గ్యాస్(styrene) గా చెబుతున్నారు.*  *నిత్యజీవింతో ఎంతో విస్తృతప్రయోజన మున్న వస్తువులను తయారుచేసేందుకు దీనిని వాడతారు. రంగు లేని ఈ వాయువుకు తీయటి వాసన ఉంటుంది. మండే స్వభావం కూడా ఉన్న గ్యాస్ ఇది...* *దీని వాడకంలో*   *ఇది మోనోమర్. ఆహారం, ఇతర వస్తులను పాకేజ్ చేసేంందుకు పాలిస్టైరీన్ ప్లాస్టిక్ వాడతారు.*  *డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులను తయారుచేసేందుకు.* *రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకువాడతారు.*  *ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం.*  *పైపులు, ఆటోమొబైల్ పార్ట్స్, ప్రింటింగ్ క్యాట్రిడ్జ్, ఫుడ్ కంటైనర్, ప్యాకేజింగ్.. వంటి వాటికి ఉపయోగిస్తారు.    ...

liquor petition to Honourable Prime Minister and Chief Ministers of All States and Union Territories.

Honourable Prime Minister and Chief Ministers of All States and Union Territories. గత కొన్ని రోజులుగా మొత్తం దేశం సాధారణ క్రమశిక్షణను చూపించింది, నోవల్ కరోనా-కోవిడ్ 19 వ్యాప్తి నిరోధించడానికి ఉద్దేశించిన లాక్ డౌను ను ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాటించడం జరిగింది. మెరుగైన భవిష్యత్తు కోసం ఆశతో పస్తులతో  శ్రద్ధగా వహించారు. ఇటువంటి కీలకమైన సమయంలో, లాక్ డౌన్ యొక్క సడలింపు నియమాల పేరులో మద్యం అమ్మకానికి అనుమతి ఇవ్వబడింది. ఆంధ్రప్రదేశ్లో మధ్యం నిషేధంపై వారు సొంత ఎన్నికల మేనిఫెస్టులో వాగ్దానం ఇచ్చారు. కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అమ్మకం చాలా బాధాకరమైనది. లాక్ డౌన్  ప్రారంభించిన నుంచి మద్యం లేనందున మద్యం వినియోగంతో సంబంధం ఉన్న గృహ హింస (మహిళలు మరియు పిల్లలపై) సంతోషంగా గడిపారు. మద్యం వ్యసనం అందుబాటులోకి రావడం, కుటుంబంలో వారిపై ప్రభావం చూపుతుంది.  రాష్ట్రం పోషకాహారం యొక్క స్థాయిని పెంచడం, ప్రజల జీవన ప్రమాణాలు, ప్రజా ఆరోగ్యం యొక్క ప్రాథమిక విధుల్లో  ప్రత్యేకంగా, రాష్ట్రానికి హాని కలిగించే మద్య పానీయాలు నిషేధాన్ని తీసుకురావాలి. మద్యం తయారు మరియు మద్...

G.O.Ms.No.3 Social Welfaere (TW .EDN. II) DepartmrntDated 01-10-2000Tribal Welfare - Education - Appointment of Teachers Reservation of all Vacancies in the Educational institutions with n the Svheduled Areas of Local Scheduled Tribes - Notification under pragraph 5(1) of he Fifth Schedule to the costitution of India - Issued.

ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని మనిషిని మార్చగలిగే అద్భుతాన్ని సృష్టించే గల వ్యక్తిని తయారు చేసే టీచర్ వృత్తిని ఏ నైపుణ్యం లేని వ్యక్తి కట్టపెట్టడం మంచిది కాదు.  గిరిజన ప్రాంతంలో 100% రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఒక్క ఉపయోగం లేదు.  2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 20 సంవత్సరాలపాటు  నైపుణ్యం లేని వ్యక్తుల ద్వారా విద్యా వ్యవస్థ ని నడిపించడం బాధాకరం ఇప్పటికైనా జీవో 3 రద్దు చేయడం సంతోషకరమైన విషయం. రిజర్వేషన్ ఎక్కడ ఇవ్వలో అక్కడే ఇస్తే మంచిది. టీచరు, డాక్టరు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించకూడదు నైపుణ్యత ఉన్న వ్యక్తులే  ఆ వృత్తులు చేపట్టాలి.