స్టైరీన్ (styrene) గ్యాస్ (C8H8) అంటే..

*వైజాగ్ లో లీకైన స్టైరీన్ గ్యాస్ : మనిషిపై చూపే ప్రభావం ఏమిటి..?*
   *
*స్టైరీన్ (styrene) గ్యాస్ (C8H8) అంటే...?*

*ఎల్. జి పాలిమర్స్ నుంచి లీక్ అయిన గ్యాస్ సైరీన్ ( C8H8).ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీ లో వాడతారు*.
*వైజాగ్ లో లీకైన గ్యాస్ ను స్టైరీన్ గ్యాస్(styrene) గా చెబుతున్నారు.*
 *నిత్యజీవింతో ఎంతో విస్తృతప్రయోజన మున్న వస్తువులను తయారుచేసేందుకు దీనిని వాడతారు. రంగు లేని ఈ వాయువుకు తీయటి వాసన ఉంటుంది. మండే స్వభావం కూడా ఉన్న గ్యాస్ ఇది...*
*దీని వాడకంలో* 
 *ఇది మోనోమర్. ఆహారం, ఇతర వస్తులను పాకేజ్ చేసేంందుకు పాలిస్టైరీన్ ప్లాస్టిక్ వాడతారు.* 
*డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులను తయారుచేసేందుకు.*
*రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకువాడతారు.*  *ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం.*
 *పైపులు, ఆటోమొబైల్ పార్ట్స్, ప్రింటింగ్ క్యాట్రిడ్జ్, ఫుడ్ కంటైనర్, ప్యాకేజింగ్.. వంటి వాటికి ఉపయోగిస్తారు.         *ఈ గ్యాస్ ను పీల్చినపుడు ఏమవుతుందని కనుగేనేందుకు పైన పేర్కొన్న వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీలలోని కార్మికుల మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని చాల మంది పరిశోధకులు పరిశీలించారు*. *మరొక విషయం ఏమంటే సిగరెట్ పొగలో కూడా కొంత మోతాదులో స్టైరీన్ ఉంటుంది.*
*ఇది క్యాన్సర్ ను తెస్తుందని కొన్ని పరిశోధనలలో శాస్త్రవేత్తలు చెప్పారు*. 

*అది గోంతులోకి మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది. ఇది శ్వాస ద్వారా శీరీరంలోకి ప్రవేసిస్తుంది. ఇది సెంట్రల్, ఫెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. ఎక్కవ మోతాదులో పీల్చుకున్నపుడు (376 పిపిఎమ్ 25 నిమిషాలపాటు) వాంతి సెన్సేషన్ వస్తుంది. తర్వాత మత్తులోకి జారుకుంటారు. తలనొప్పి ఉంటుంది. చర్మం మీద దురద వస్తుంది. కళ్లు మండుతాయి. ఎక్కువ సేపు ఈ వాయువుకు ఎక్స్ పోజ్ అయితే, న్యూరో బిహేవియర్ లో మార్పు వస్తుంది. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి*.
*ఈ వాాయువు విషవాయువు.*              *న్యూరో టాక్సిన్. దీనికి పీల్చుకున్నపుడు అది వూపిరితిత్తులలోకి ప్రవేశించాక శరీరానికి అక్సిజన్ అందకుండా చేస్తుంది. మెదడుకు అవసరమయిన మోతాదులో ఆక్సిజన్ అందనపుడు మనిషి అపస్మారక స్థితిలోకి జారుకుంటారు. ఇదే  ఇపుడు జరిగింది*.

*స్టైరీన్ అన్నది సాధారణంగా సిగరెట్లలోనో, ప్యాకింగ్ ప్రోడక్ట్స్ లోనూ ఉంటది. వాహనాల పొగలో కూడా కొద్ది మొత్తంలో స్టైరీన్ ఉంటుంది. కొన్ని కొన్ని పండ్లలో కూడా స్టైరీన్ అన్నది ఉంటుంది.*

*స్టైరీన్ ఉన్న భోజనాన్ని, నీటిని తీసుకోవడం ద్వారా అది లోపలి వెళ్లే అవకాశం ఉంది. పాలీస్టెరీన్ కంటైనర్లను ఫుడ్ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీని వలన కలిగే ప్రమాదం చాలా తక్కువే*.

*సిగరెట్లను తాగడం, సెకండ్ హ్యాండ్ స్మోక్, వాహనాల వలన వచ్చే వాయువుల్లో కూడా స్టైరీన్ ఉంటుంది. బిల్డింగ్ మెటీరియల్స్ లో కూడా నుండి కూడా స్టైరీన్ అన్నది చిన్న మొత్తంలో ఉంటుంది. స్టైరీన్ తో తయారైన పదార్థాలు వాడడం వలన కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది.* *ఇవంతా చాలా చిన్న మొత్తంలో స్టైరీన్ ను మనిషి తాకితే చోటు చేసుకునే పరిణామాలు*

*స్టైరీన్ గ్యాస్ ను పీల్చడం వలన కలిగే ఇబ్బందులు*

*తాత్కాలిక ఇబ్బందులు:*

*కళ్ళకు, చర్మం, ముక్కుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.*
*విపరీతమైన మంట.*
*జీర్ణాశయాంతర సమస్యలు*.
*గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం.*
*స్పృహ తప్పి పడిపోవడం.*

*దీర్ఘకాలిక సమస్యలు:*

*నాడీ వ్యవస్థ మీద కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది.*
*తల నొప్పి వచ్చే అవకాశము ఉంటుంది*.
*డిప్రెషన్ కు దారితీస్తుంది*.
*అలసట* *బలహీన పడడం.*
*వినికిడి కోల్పోవడం*.
*బ్యాలెన్స్,  ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి*.
*క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది*.

*ఎక్కువ సేపు ఈ గ్యాస్ ను పీల్చడం వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి.. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వైజాగ్ లో గ్యాస్ లీక్ ఘటన ఇలాంటిదే*

Comments

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax