సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ
పేరు శ్రీ వాసు గారు గత కొన్ని సంవత్సరాలుగా విస సర్పాలను ఇళ్లల్లో, గ్రామంలో, పట్టణాల్లో, పట్టుకుని వాటిని చంపకుండా అడవిలోకి వెళ్లి వదిలి వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 3000 వేలు, రకరకాల సర్పలను పట్టుకున్నారు. ఈరోజు అనగా జూన్ 25, 2022న మూడు నాగు పాములు ఒక రక్తపింజర నీ పట్టుకున్నారు. దాచిపెట్టడానికి సరైన స్థలం లేదు ఓ చిన్న బర్డ్స్ పెట్టెలో పెట్టి ఒక మేడ మీద ఉంచారు. మా ఇంటి దగ్గర ఒక నాగుపాము రాత్రి 8:40 సమయంలో పట్టుకోవడం జరిగింది. శ్రీ వాసు గారు ఉండడంవల్ల ఆ పామును చంపకుండా అడవిలోకి వదిలే అవకాశం వచ్చింది లేకపోతే ఉంచుకొని ఉండలేము అలాగని దాన్ని చంపి పశ్చాత్తాపానికి లోనవలేముగా. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా! దారి తప్పి వచ్చిన ప్రాణులను చంపడం తప్పు. అందుకే శ్రీ వాసు గారు స్వచ్ఛందంగా సర్పల పరిరక్షణ కోసం ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలాని అనుకుంటున్నారు. ఈ సర్పాలు మట్టిని గుల్ల చేసి మృత్తికలు ఏర్పాటు చేసి వ్యవసాయనికి అనుకువగా చేస్తూ ఉంటాయి. చాలా ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు హడలేత్తి పోయి ప్రాణభయంతో సర్పాలను చంపేస్తున్నారు కానీ మానవ మనుగడకు సర్పాలు ప్రకృతికి ఎంతగానో కృషి చేస్తున్నాయి....