సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ
పేరు శ్రీ వాసు గారు గత కొన్ని సంవత్సరాలుగా విస సర్పాలను ఇళ్లల్లో, గ్రామంలో, పట్టణాల్లో, పట్టుకుని వాటిని చంపకుండా అడవిలోకి వెళ్లి వదిలి వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 3000 వేలు, రకరకాల సర్పలను పట్టుకున్నారు.
ఈరోజు అనగా జూన్ 25, 2022న మూడు నాగు పాములు ఒక రక్తపింజర నీ పట్టుకున్నారు. దాచిపెట్టడానికి సరైన స్థలం లేదు ఓ చిన్న బర్డ్స్ పెట్టెలో పెట్టి ఒక మేడ మీద ఉంచారు. మా ఇంటి దగ్గర ఒక నాగుపాము రాత్రి 8:40 సమయంలో పట్టుకోవడం జరిగింది. శ్రీ వాసు గారు ఉండడంవల్ల ఆ పామును చంపకుండా అడవిలోకి వదిలే అవకాశం వచ్చింది లేకపోతే ఉంచుకొని ఉండలేము అలాగని దాన్ని చంపి పశ్చాత్తాపానికి లోనవలేముగా. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా! దారి తప్పి వచ్చిన ప్రాణులను చంపడం తప్పు.
అందుకే శ్రీ వాసు గారు స్వచ్ఛందంగా సర్పల పరిరక్షణ కోసం ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలాని అనుకుంటున్నారు. ఈ సర్పాలు మట్టిని గుల్ల చేసి మృత్తికలు ఏర్పాటు చేసి వ్యవసాయనికి అనుకువగా చేస్తూ ఉంటాయి. చాలా ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు హడలేత్తి పోయి ప్రాణభయంతో సర్పాలను చంపేస్తున్నారు కానీ మానవ మనుగడకు సర్పాలు ప్రకృతికి ఎంతగానో కృషి చేస్తున్నాయి.
జీవ చక్రానికి ప్రతి జీవి అవసరమే అందుకని వాటి పరిరక్షణ కోసం ఒక వేదిక ఏర్పాటు చేయాలని శ్రీ వాసు గారు అనుకుంటున్నారు. ఒక ఆర్గనైజేషన్ పెడదామనుకుంటున్నారు ఏదైనా మంచి పేరు ఉంటే సూచించగలరు.
మీకు ఇటువంటి ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.
ముఖ్యాంశాలు:-
1. ఆర్గనైజేషన్ పేరు :
2. ఆర్గనైజేషన్ లో ఉన్న ఏడు మంది వివరాలు
1. ప్రెసిడెంట్
2. వైస్ ప్రెసిడెంట్
3. జనరల్ సెక్రెటరీ
4. జాయింట్ సెక్రెటరీ
5. ట్రెజరర్
6. మెంబర్
7. మెంబర్
3. ఆర్గనైజేషన్ అకౌంట్ ఓపెనింగ్
4. ఆర్గనైజేషన్ ఆఫీస్ : అంటే పాములు పెట్టడానికి గల స్థలం, బుట్టలు, వాటికి ఆహారం మొదలగునవి
5. పాములు పట్టుకోడానికి గలా పనిముట్లు.
ఆర్గనైజేషన్ సిద్ధాంతాలు:
1. దారి తప్పి ఇళ్లల్లో గ్రామంలో పట్టణాల్లో నగరాల్లో చోరబడిన పాములను పట్టుకోని సుదూరమైన అడవుల్లో వదిలివేయడం.
2. పాము కాటుకు గురి కాకుండా ఎలా జీవించాలో ప్రజలకు అవగాహన కల్పించడం. యేట పాము కాటు వల్లే చాలా మంది చనిపోతున్నారు.
4. పాము కాటుకి గురైన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స చేయడం.
5. సర్పాలను పట్టుకునెందు ట్రయినింగ్ ఇవ్వడం.
ప్రత్యేకత:-
1. భారతీయ సంస్కృతిలో పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.
3. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు ఇవీ
ఏటా పాము కాటుకు 5.4 మిలియన్ మంది ప్రజలు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలుచెబుతున్నాయి. ఇందులో 81 వేల నుంచి 1,38,000 మంది మరణిస్తుండగా... చాలా మంది విష ప్రభావంతో కొన్ని అవయవాలు ధ్వంసమై దివ్యాంగులుగా మిగిలిపోతున్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే మరణాల సంఖ్య తగ్గించాలన్న ఉద్దేశంతో నాణ్యతగల పాము విషంతోనే మందు తయారు చేయాలని భావించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
Comments
Post a Comment