పాడేరు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి జన్ జీవన్ సంఘ్ సెక్రెటరీ వ్రాయునది ఏమనగా
పాడేరు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి జన్ జీవన్ సంఘ్ సెక్రెటరీ వ్రాయునది ఏమనగా
అయ్యా
జన్ జీవన్ సంఘ్ సంస్థ (రిజిస్టర్ నెంబర్ 34/2015) అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది అందులో భాగంగా పరిసరాల పరిశుభ్రత అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కొరకై మా సంస్థ పని చేయుచున్నది. ఆ క్రమంలో పాడేరు డివిజన్ అటవీశాఖ ను సందర్శించడం జరిగింది మాకు తెలిసిన విషయం ఏమనగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఎవరైనా వన్య ప్రాణులను చంపడం అటవీ సంపదను అపహరించినట్లతే వారిని శిక్షించి జరిమానా విధించి అవసరమైతే జైలుకు పంపిస్తున్నారు.
కానీ అడవి సంరక్షణ కోసం మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మాకు అనిపించడం లేదు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు అవగాహన మాత్రమే చేయగలుగుతాం కానీ వాటిని అమలు చేయాల్సింది అటవీ శాఖ. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మా పర్యటనలో తెలిసింది. మీరు మీ పనిని సక్రమంగా నిర్వహించడం లేదని నాకు తెలుస్తుంది దానికి సాక్షాధారాలు గా కనిపిస్తున్న బోడి కొండలు ఏజెన్సీలు అనేక రకాల చెట్లు వనమూలికలు ఉన్న అడవి నాశనం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.అడవి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు కారణం పోడు వ్యవసాయము, వంట చెరకు అధికంగా నరికివేయడం వల్ల అడవులను నాశనం అయిపోయాయి. కాబట్టి అడవి రక్షణ బాధ్యతగా , అడవుల పోషణ అంటే వనాలను పెంచడం, వన్య ప్రాణులకు రక్షణ మరియు ఆహారం కోసం కొన్ని అడవులలో పెన్సింగ్ వేసి గ్రామస్తులు, గానీ ఇతరులు గాని ఆయా ప్రాంతాలకు వ్యవసాయం నిమిత్తం గానీ జంతువులు వేటాడ్డం గాని వంటచెరుకుకు గాని అడువిలోకి ప్రవేశించ కుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
వన సంరక్షణ సమితి లాంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేము విన్నాము అయినప్పటికీ వీటితో సంతృప్తి లేదు. మొక్కలను పెంచి నర్సరీ వేసుకోవడానికి ఇస్తున్న ఆదాయం సరిగ్గా ప్రజలకు అందడం లేదు దీనికోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి గ్రామ పంచాయితీలో వన సంరక్షణ సమితి మరియు అటవి శాఖ కార్యక్రమం ప్రతి నెలా నిర్వహించి అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి పాటుపడి ప్రజలను చైతన్యపరచాలి.
ఏజెన్సీలో 11 మండలాలు కలవు అన్ని గ్రామాలలో అనేక దట్టమైన అడవులు ఉండేవి పనిముట్లు తయారు చేయడం గాని వంట చెరకుగానే ఉపయోగించేవారు ఇలా వాళ్ళ అవసరాల కోసం ఫర్నిచర్ కి బదులు ప్లేవుడ్ లాంటివి ప్లాస్టిక్ ఫర్నిచర్ వచ్చాయి. వంటచెరకు బదులు గ్యాస్ సిలిండర్లు వచ్చాయి కాని అవగాహన లేదు. ముఖ్యంగా అటవీ చట్టాల గురించి గ్రామీణ ప్రజలకు తెలియకపోవడం వల్ల వారు ఒక క్రమపద్ధతిలో లేరు. అవగాహన రాహిత్యం ముఖ్య కారణం. దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రజల్లోకి వెళ్లి పరిశీలనగా సమస్యలు గమనించగలరని ఆశిస్తున్నాము.
సెక్రెటరీ
జన్ జీవన్ సంఘ్
పాడేరు మండలం విశాఖపట్నం జిల్లా
దూరవాణి: 8309988735
ఇమెయిల్: janjeevansangh@gmail.com
Comments
Post a Comment