అరకు బోర్రా గ్రూహల చరిత్ర
బొర్రా గుహల చరిత్ర
విశ్వసుందర నగరంగా పిలవబడే విశాఖపట్నం ఉత్తర దిక్కున సుమారు 100కి.మీ. దూరంలో సముద్రమట్టానికి 800 మీ" నుండి 1300 మీ" ఎత్తులో పర్వత సోయగలతో,పచ్చదనపు పరవళ్ళుతో "ఆంధ్రా ఊటీ" అందాల 'అరకులోయ' కు అతి సమీపాన ప్రకృతి రామనీయతతో మైమరిపించే హిమగిరి 'అనంతగిరి' లో సుమారు 150 మిలియన్ సవంత్సరాల క్రితం సహజసిద్ధమైన అనైక చౌగోళిక, రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన బువిజ్ఞాన అద్బుతమే ఈ గుహలు. వీటిని బ్రిటిష్ భూవిజ్ఞాన
శాస్త్రజ్ఞుడు (Geologist) 'శ్రీ విలియం కింగ్' తొలిసారిగా 1807 వ సంవత్సరంలో గుర్తించాడు. 'బొర్రా' అనగా ఒడియా భాషలో 'రంధ్రం' అని అర్థం. ఈ గుహలోకి ప్రవేశ మార్గం ఒక రంధ్రంలా ఉంట్టుంది. అందువలన 'బొర్రా' అను నామం ఏర్పడి ఉండవచ్చని స్థానికుల కధనం. ఈ గుహల సారంగమార్గం ప్రవేశ ద్వారం వద్ద సముద్ర మట్టానికి 705 మీ" ఎత్తులో ఉండీ క్రమంగా లోపలికి పోయే కొలది 625 మీ" ఎత్తుకు తగ్గుతుంది.
గుహల ఆవిర్భావం : తూర్పు కనుమలలో ఈ కొండలలో అవక్షేప శిలల "సున్నపురాళ్లు"
(Lime stone) చాలా ఎక్కువ . వాటి స్థిర రూపమైన 'కల్సెంట్' రకం శిలలు కొండలు అంతర్గభంలో విరివిగా ఏర్పడి. వాటిపైన చారోకైట్ అనే రూపాంతరం చెందిన అవక్షేప శిలాలతో (Metamorphosed sediments) కష్టబడి పర్వతలుగా ఏర్పడ్డాయి. కలగమనంలో ఈ పరిసరాలలో వర్షపు నీరు , భూగర్భ జలం మొదలైనవి కొండల అంతర్గభంలో కల్సెంట్ శిలలా సమీపంలో ప్రవహిచడం వలన వాటి భౌతిక , రసాయనిక చర్యలకు ఆ శిలలు క్రమంగకరిగిపోతు ఈ గుహలు ఏర్పర్చాయి.
శాస్త్రీయ వివరణ: చారోకెట్ శిలలు నీటిలో కరుగవు. కానీ కల్సెంట్ శిలలు కారుగుతాయి.అయితే సాధారణ నీరు కల్సెంట్ శిలలను కరిగించవు.కానీ అదే నీరు వాతావర్ణం లో కార్బన్ డై ఆక్సైడ్ తో కలిసి 'కార్పొనిక్ ఆమ్లం'గా మరి కల్సెంట్ తో రసాయనిక క్రమక్షయం జరిపి అందులోని కార్బోనేట్ లను నీటిలో సులువుగా కరిగిపోయా బి కార్బోనేట్ గా మారుతుంది.
అన్ని
సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లోనే ఆ గుహలు దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టంగా
ఉంటుంది అల్లాంటిది ఆ రోజుల్లో ఆ శాస్త్రవేత్త ఆ గుహలను కనుకోవడం చాలా
గొప్ప విషయం గా చెప్పుకోవచ్చు.
Comments
Post a Comment