యూనిసెఫ్ అడల్ సెంట్ హెల్త్ కార్యక్రమం

Unicef Project and Students deparation-saprations


విద్యార్థులలో ఉన్న అనేక మార్పులలో ఇది వారి జీవితాలను మార్చే మార్పు అని పరిగణనలోకి తిసుకోవచ్చు. ఏదైనా చిన్నప్పుడు జరిగిన మార్పులనుగునంగా మనిషి భవిష్యత్తు ఉంటుంది.
ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

పరిచయం:
నా పేరు అప్పాజీ నాయక్ న్యాయవాది. కోంత దేశ సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రోజెక్ట్ కి రావడం జరిగింది. అలాగే జన్ జీవన్ సంఘ్ స్వచ్ఛంద సంస్థ కి జనరల్ సెక్రటరీ గా పనిచేస్తున్నను.
ఇక ప్రోజెక్ట్ విషయంలోకి వద్దాం. 


యూనిసెఫ్ అడల్ సెంట్ హెల్త్ కార్యక్రమం. ద్వారా విద్యార్థులలో మానసిక ఒత్తిడిని, మరియు అనేక మార్పులు గమనించండం జరిగింది.

భారతదేశంలో 32కోట్లమంది అడల్స్ సెంట్స్ ఉన్నారు. యూనిసెఫ్ ప్రోజెక్ట్ ద్వారా అన్ని ప్రభుత్వ హైస్కూల్ లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించడం ప్రధాన ఉద్దేశం. అయితే మొట్టమొదటి సారిగా భారత దేశంలో విశాఖపట్నం జిల్లా 45 మండలాల్లో ప్రారంభించారు.

గమనించిన సంఘటనాలు:
విద్యార్థులు ఒంటరిగా ఉండటం అంటే వ్యక్తులు మరియు సంఘం నుండి స్వయంగా తొలగిపోవడం లేదా దూరంగా ఉండటం. యుక్తవయస్సులోని పిల్లలు పలు శారీరక మరియు మానసిక మార్పులతో ఎల్లప్పుడూ ఆందోళనగా ఉంటారు.
ఉదాహరణకు పిల్లలకు ప్రశ్నలు వెస్తే సమాధానం  సరిగ్గా చెప్పకపోవడం.
కొన్నిసార్లు మెము యుక్తవయస్సులోని పిల్లలు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా బంధువుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో వారి వ్యక్తిగత విషయాలను, వారి ప్రవర్తనలో మార్పు తెలుసుకోవడం జరుగుతుంది.  కోంత మంది విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం లేదా కలవడానికి ఇష్టపడకపోవడం వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు.
ఒంటరిగా ఉండాలని భావించడం అనేది క్లిష్టమైన పరిస్థితి మరియు శారీరక మరియు మానసిక కారకాలు రెండింటి వలన సంభవిస్తుంది.
ఇది వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది,

యుక్తవయస్సులోని పిల్లల్లో ఒంటరిగా ఉండాలని భావించే లక్షణాలను ఎలా గుర్తించాలి?(How do we identify alienation among teens?)

ఫ్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు డిజిటల్ పాఠాలు చెప్పడమే కాకుండా బోధన లోపాలను పసిగట్టడం జరిగింది. గురువే దైవము అని తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ లో వదిలి వెళ్తారు. గురువు పాఠం చెప్పి వెళిపొతాడు. మనసులో బాధలను , భావాలను స్నేహితులతో స్వేచ్ఛగా చెప్పుకుంటారు. కాని ఇద్దరికి జ్ఞానం ఒకేలా తెలుసు అలాంటప్పుడు స్నేహితులకు కూడా తెలియని సమస్యలు యూనిసెఫ్ తమ హెల్త్ బాక్స్ లో చీటి వెసి తెలుసుకోవచ్చు. విద్యార్థుల యొక్క అనేకానేక  ఒత్తిడిని పరిశీలించి, పరిశోధించి,  విలైంనంత వరకు యూనిసెఫ్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగుతుంది.
యూనిసెఫ్ పిల్డ్ కోఆర్డినేటర్ గానే కాకుండా మిత్రుడుగా, ఓ అన్నయ్య లా విద్యార్థులతో కలిసిపోయి వారి   ఆలోచనలు, అలావాట్లు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించడం జరిగింది.
కోంత మంది విద్యార్థులలో మానసిక ఉల్లాసం లేకపోవడం,
నిరుత్సాహంగా ప్రవర్తించడం
స్కూల్  పట్ల ఆసక్తి కోల్పోవడం
ఒంటరిగా ఎక్కువ సమయం గడపడం.
జీవితంలో సంఘటనలు లేదా సంభాషణలు ముగిసినట్లు భావించడం.
కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో దూరంగా మెలగడం.
ఇతరులకు భిన్నంగా ఆలోచించడం
తల్లిదండ్రులను కలుసుకోవడానికి లేదా మాట్లాడటానికి సందేహించడం
నిబంధనలను పాటించడానికి తిరస్కరించడం
సరిగ్గా తినకపోవడం లేదా ఎక్కువగా తినడం
నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం
తమపై తమకు గౌరవం లేకపోవడం.

ఒంటరిగా ఉండాలనే భావన, అసలు ఎందుకు కలుగుతుంది, ఇలా జరుగడానికి కారణాలెంటో చూద్దాం...
సాధారణంగా యుక్తవయస్సులోని పిల్లల్లో ఒంటరిగా ఉండాలనే భావన కనిపిస్తుంది. దానికి కారణం:
స్కూల్‌లో వేధింపు
తోటివారి ఒత్తిడి
చాలా కఠినంగా వ్యవహరించే తల్లిదండ్రులు
విద్యా సంబంధిత ఒత్తిడి
గృహ హింస
తల్లిదండ్రులు విడిపోవడం లేదా విడాకులు తీసుకోవడం
స్కూల్ మారడం లేదా నివసిస్తున్న ప్రాంతం మారడం వంటి వారి సౌకర్యవంతమైన పరిస్థితుల్లో మార్పులు
యుక్తవయస్సులో, పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల విశ్వాసం తగ్గిపోవడం లేదా ఇప్పటి వరకు నేర్చుకున్న విలువలను మరిచిపోవడం ప్రారంభం కావచ్చు. వారు స్కూల్‌లో ఉపాధ్యాయులు మరియు స్నేహితులకు దూరంగా ఉండటం ప్రారంభించవచ్చు.
యుక్తవయస్సులోని పిల్లలు వారి శరీర ఆకృతి మరియు సామాజిక నైపుణ్యాలు గురించి కూడా ఆందోళన పడవచ్చు.
ఇటువంటి ఆలోచనలు పిల్లలకు ఉన్నవిని  గ్రహించిన మాకు కాస్త బాధేసింది వెంటనే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారిలో ఉండే భావనను ఏ విధంగా నివారించవచ్చు? పరిష్కారం దిశగా మా ఆలోచనలు పదును పెట్టడం జరిగింది.
యుక్తవయస్సులోని పిల్లల్లో ఒంటరిగా ఉండాలనే భావనను నివారించడానికి కింది జాగ్రత్తలు తీసుకోవాలి:
తల్లిదండ్రులు మరియు యుక్తవయస్సులోని పిల్లల మధ్య సంభాషణలు ఎక్కువగా ఉండాలి.
పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి
రోజూ వారి సమస్యలు మరియు ఆందోళనలను తెలుసుకోవాలి.
వారి మనస్తత్వాన్ని అంచనా వేయరాదు లేదా వారి ప్రవర్తనపై వ్యాఖ్యానించరాదు.
స్కూల్‌లో పిల్లల కార్యాచరణలను తెలుసుకుంటూ ఉండాలి.
ఆటలు వంటి అధిక శారీరక కార్యాచరణల్లో పాల్గొనమని ప్రోత్సహించాలి.
స్నేహితులను పెంచుకోవాలని మరియు వారితో ఎక్కువ సమయం గడపమని ప్రోత్సహించాలి.
జాగ్రత్తగా ఉండాలి.
యుక్తవయస్సులోని పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వారిపై తల్లిదండ్రులు, గురువులు శ్రద్ద చూపించాలి.
ఆత్మ విశ్వాసం సన్నగిల్లడం.
కనిపించే రీతిలో హాఠాత్తుగా మార్పులు.
నిద్రపోవడం మరియు తిండి అలవాట్లల్లో మార్పులు.
మాదకద్రవ్య లేదా మద్యపాన దుర్వినియోగం,
స్కూల్‌లో  తోటివారితో ఎక్కువగా కోపగించుకోవడం,
ఇటువంటి పిల్లలకు మానసిక ఆరోగ్య వైద్యులకు చుపించాలి.
ఇవి యువత డిప్రెషన్ లక్షణాలు కావచ్చు.
సరైన చికిత్సతోపాటు కౌన్సలింగ్ అవసరం. ఏరియా ఆసుపత్రిలో ఉన్న AFS కౌన్సిలర్ ద్వారా మానసిక ఒత్తిడి నివారణకు, పరిహారం దక్కితే ఆనందించాల్సిన విషయమే. కాని ఇటువంటి మానసిక ఆరోగ్యం అవగాహన కార్యక్రమాలు కోసం మంచి మానసిక నిపుణులను ప్రభుత్వ పాఠశాలకి పెడితే బాగుంటుంది. ప్రతి  ప్రైమరి హెల్త్ సెంటర్ వైద్యులు అను క్షణం విద్యార్థులలో మానసిక పరిస్థితిని అర్థం చెసుకోని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి.


ఇట్లు
కె. అప్పాజీ. న్యాయవాది
సెక్రెటరీ, జన్ జీవన్ సంఘ్.
యూనిసెఫ్ ఫిల్డ్ కోఆర్డినేటర్
విశాఖపట్నం జిల్లా.
సెల్: 8500096304 , Email: appajinayak10@gmail.com

Comments

Post a Comment

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax