గ్రామ దర్శిని కార్యక్రమం gramadhrasini program


https://137988147585781955.weebly.com/blog


                               గ్రామ దర్శిని కార్యక్రమం

విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి గ్రామ పంచాయితీలో గ్రామదర్శిని కార్యక్రమంలో జన్ జీవన్ సంఘ్ స్వచ్ఛంద సంస్థ మరియు ప్రభుత్వ అధికారులు భాగస్వామ్యంతో అనేక సమస్యలు చర్చించడం మరియు సమస్యల గురించి ప్రశ్నించడం జరిగింది.

 కార్యక్రమ వివరాలు:
కార్యక్రమం : గ్రామ దర్శిని 
తేది : 28 సెప్టెంబరు 2018
స్థలం: వంతాడపల్లి గ్రామ పంచాయితీలో
పాల్గొన్న గ్రామాలు: వంతాడపల్లి, కోట్ల గరువు, వీస మామిడి, శ్రీరామ్ నగర్, వనగరాయి, సప్పిపుట్టు, నరింగపాడు.
పాల్గొన్న అధికారులు :  ప్రత్యేక అధికారిగా ఎంపిడిఓ మధుసూదన్ రావు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గారు గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు.

గ్రామదర్శిని కార్యక్రమానికి వచ్చిన విభాగం వారి మరియు అధికారులు వివరాలు,
1). అగ్రికల్చర్ (AO)
2). మండల విద్యాశాఖ అధికారి (MEO) : సరస్వతి గారు.
3). CDPO : లలిత  గారు.
4). రూరల్ వాటర్ మరియు సానిటరీ డిపార్ట్మెంట్ (RWS)
5). రెవిన్యూ డిపార్ట్మెంట్ : RI గారు
6). ఉపాధి హామీ పథకం : ఏ పిఓ గారు
7). ఏపిఎమ్ గారు
8). గ్రామ కార్యదర్శి : మత్స్య రాజు గారు
9). విలేజ్ రెవెన్యూ ఆఫీసర్.

గ్రామ దర్శిని ఈ కార్యక్రమంలో జనజీవన సంఘ్ ఆధ్వర్యంలో అనేక సమస్యలను గుర్తించి ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం  జరిగింది. ఆ యా సమస్యలను కూలంకుషంగా కింది వివరించడం జరిగింది.

1). గత కొన్ని సంవత్సరాలుగా మండల ప్రాథమిక పాఠశాల సంబంధించి ప్రహరీ నిర్మాణం జరగలేదు శిధిలావస్థలో ఉన్న బిల్డింగు మూడు సంవత్సరాల నుంచి స్కూలు స్థానం ఇప్పటిదాకా కూడా అదే ప్రాంతంలో మరో బిల్డింగ్ కట్టడం జరగలేదు. దాని గురించి అధికారి దృష్టికి తీసుకెళ్లాము.  అలాగే కాంపౌండ్ నిర్మించాలని,  లోపల ఉన్న2  పని చెయ్యని చేతి పంపులు రెవిన్యూ డిపార్ట్మెంట్ మూసి వేయాల్సిందిగా కోరడమైనది.

2). RWS: గ్రావిటీ వాటర్ గ్రామ పంచాయతీకి ఏర్పాటు అందివ్వాలని కోరడమైనది.
          గతంలో 10లక్షల రూపాయల వాటర్ షెడ్ పధకం ద్వారా కాంట్రాక్టర్ తాత్కాలికంగ వేసి డబ్బు వృధా చేశాడు ఒక సంవత్సరం కూడా అది సరిగ్గా పని చేయలేదు. ఆ కాంట్రాక్టర్ మరియు ఆ పనిని ఇచ్చిన ప్రభుత్వ అధికారులును విచారించి, మళ్ళి పంచాయతీకి వస్తూన్న వాటర్ షెడ్ పధకం ప్రకారం 27లక్షల రూపాయల ప్రాజెక్టుని సక్రమంగా భావి తరాలకు అందించటానికి ప్రయత్నం చేయాలి.

3). గ్రామంలో రోడ్డు అన్ని వీధులకు సక్రమంగా నాణ్యతతో నిర్మించాలని ప్రభుత్వం కోరడమైనది.

4). పింఛను, పౌష్టికాహారం, అంశాలపై గౌరవనీయులైన శాశన సభ్యులు శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారు తమ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.

5). ప్రభుత్వ పధకాల లబ్దిదారులకు చేకూరే విధంగా ప్రయత్నం చేయాలి.

6). డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం అని చంద్రబాబు చేయలేదని డ్వాక్రా మహిళలు ప్రశ్నించారు. రుణాలను మాఫీ చేయాలని కోరడం జరిగింది. పసుపు కుంకుమ కోసం ఇచ్చిన డబ్బులు బ్యాంకు మెనేజర్ అప్పు కింది జమచేశారని మాకు ఆ డబ్బులు ఇవ్వలేదని వాపోయారు.

6). అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధిక డిస్కౌంట్తో వ్యవసాయ పరికరాలను ప్రోత్సహిస్తుందని చెప్పడం జరిగింది మరియు 18 ఎకారాల కాఫి ప్లాంట్ అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది.

7). కోత్తగా 18 గృహలు పంచాయతీకి వచ్చాయని వివరించారు.

8).  ఉపాధి హామీ పథకం ప్రకారం డబ్బులు ఇచ్చేటప్పుడు మోసం జరిగిందని పోష్టల్ అకౌంట్ నుంచి బ్యాంకు అకౌంట్ కి మార్చాలని కోరడమైనది.

ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలు తీసుకోవడమే కాక గ్రామాభివృద్ధి దేశ వృద్ధి కూడా వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగంలో ప్రజలు అభివృద్ధి చెంది దేశాన్ని అభివృద్ధి చెందడానికి కృషి చేయవలసి లేక ప్రజలకు అనేక అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది.



ఇట్లు
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

Comments

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax